22.5.25

కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మకు శ్రీవారి సారె




చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శ్రీవారి సారెను అందజేశారు.

కుప్పం జాతర సందర్భంగా అమ్మవారికి టీటీడీ తరుపున సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులతో కలిసి చైర్మన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మంచి జరగాలని ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ప్రార్థించారు. ఏడాదికోసారి మాత్రమే కల్పించే అమ్మవారి విశ్వరూప దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్ పాల్గొన్నారు.

No comments :
Write comments