హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరుపున చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు గురువారం ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేకం పూజలు నిర్వహించిన అనంతరం సింధూర వస్త్రంతో చైర్మన్ ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ హనుమజ్జయంతి రోజున జాపాలి హనుమాన్ కు టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులందరికీ హనుమంతుని అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీజీవో శ్రీ సురేంద్ర, ఆరోగ్యాధికారి శ్రీ మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.






No comments :
Write comments