23.5.25

కుల్లూరు అభయారణ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న టిటిడి ఛైర్మన్





శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులోని ఆరామ మారుతి నిలయ అభయారణ్య ఆంజనేయ స్వామి వారిని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గురువారం దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు టిటిడి ఛైర్మన్ చేరుకోగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్ ఆహ్వానం మేరకు టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అభయారణ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న టిటిడి ఛైర్మన్ కు జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్, జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్, పలువురు స్థానిక నేతలు స్వాగతం పలికారు. 

No comments :
Write comments