టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మే 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 160 దేవాలయాల్లో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఏపీలోని 79, తెలంగాణలోని 81 దేవాలయాలలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా స్వామి వారికి అభిషేకము, ఆకుపూజ , భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగనున్నాయి. సదరు ఆలయాలలో " మనగుడి" కార్యక్రమంలో భాగంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు.
"మన గుడి" కార్యక్రమంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశేష పర్వ రోజులలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి పండుగ సందర్భంగా దళిత, గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో నిర్మించిన 315 భజన మందిరాలలో మన గుడి కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విదితమే.

No comments :
Write comments