పలమనేరులోని టిటిడి గోశాలలో టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు బుధవారం ఆకస్మిక పరిశీలన చేపట్టారు. పలమనేరులో 450 ఎకరాలలో టిటిడి స్వదేశీ గో సంవర్థ సంస్థ 500 గోవులతో గోశాల నడుస్తోంది. గోవుల సంరక్షణ సక్రమంగా లేకపోవడం, అపరిశుభ్రంగా పరిసరాలు ఉండడంపై టిటిడి ఛైర్మెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల రోజువారి నిర్వహణపై వారం రోజులలో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోశాలలోని గోవులకు టిటిడి ఛైర్మెన్ పశుగ్రాసం పెట్టారు. గోవులకు అందిస్తున్న దాణా, తాగునీరు, వైద్యం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

No comments :
Write comments