శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్లో ప్రసారమౌతున్న కార్యక్రమాల నాణ్యత మరియు అభివృద్ధిపై శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఈవో శ్రీ జె.శ్యామలరావు కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు. శ్రీవారి భక్తులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలకు రూప కల్పన చేయాలని తద్వారా వీక్షకుల సంఖ్య పెంచ వచ్చునని తెలిపారు.
ఈవో మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించడంతో పాటు యువతకు చేరువయ్యేలా కార్యక్రమాలు ప్రసారం చేయాలని తెలియజేశారు.
అంతకు మునుపు సాంకేతిక మరియు కంటెంట్ నిపుణులు శ్రీ శ్రీనివాసరెడ్డి, శ్రీ రవి కుమార్, శ్రీ శ్రీనివాస్ ఎస్వీబీసీ కార్యక్రమాల ప్రమాణాలను మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దేలా పలు సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ మరియు సీఈఓ ఎస్వీబీసీ ఇంచార్జి శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్డీ శ్రీమతి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments