1.6.25

జూన్ 2 నుండి ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌లో ప్రవేశాల‌కు దరఖాస్తుల ఆహ్వానం SV DANCE & NADASWARAM SCHOOL




తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో 2025-26వ విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి జూన్ 02వ తేదీ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.


కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి, నృత్యం, హరికథ, మృదంగం, ఘటం విభాగాల్లో ఫుల్‌టైమ్, విశార‌ద‌(డిప్లొమా), ప్ర‌వీణ‌(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్‌టైమ్ స‌ర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి.

 జూన్ 27వ తేదీ నుండి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. ఇత‌ర ప్రాంతాల విద్యార్థుల‌కు హాస్ట‌ల్ వ‌స‌తి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో ఈవో, టిటిడి పేరుతో రూ.50/- డిడి తీసి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్‌ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కోర్సులకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 9440793205, 9848374408 నంబర్లలో సంప్రదించగలరు.

No comments :
Write comments