14.6.25

టీటీడీ ట్రస్టులకు విరాళం టీటీడీకి శుక్రవారం రూ.20.50 లక్షలు విరాళంగా అందింది




విజయవాడలోని ఫార్ట్యూన్ ఫైన్ జ్యూవెలర్స్ కు చెందిన శ్రీ కోమటి సునీల్ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,50,001 విరాళం అందించారు.

తాడేపల్లిగూడేనికి చెందిన శ్రీమతి మాతురు పంచాక్షరి శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళంగా ఇచ్చారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

No comments :
Write comments