23.6.25

టీటీడీ కి ఏసి బస్సు విరాళం AC Bus




ప్రఖ్యాత ఆటో మొబైల్ కంపెనీ, అశోక్ లేలాండ్ టిటిడికి ఒక 41-సీటర్ ఏసి బస్సును ఆదివారం నాడు విరాళంగా అందించింది.

సుమారు రూ. 35 లక్షల విలువైన ఈ బస్సును అశోక్ లేలాండ్ M&HCV అధ్యక్షుడు శ్రీ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు టిటిడికి అందజేశారు. సాధారణంగా ప్రతి ఏడాది అశోక్ లేలాండ్ కంపెనీ వారు టిటిడి కి ఒక ఆటోమొబైల్ వాహనాన్ని విరాళంగా అందిస్తుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, తిరుమల డిపో డిఐ శ్రీ వెంకటాద్రి నాయుడు  తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments