అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 8.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు హనుమంత వాహనంపై శ్రీ రామావతారం అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.
ఉదయం 08.00 గంటలకు హనుమంత వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 - 4.00 గం.ల మధ్య పుణ్యహం, వసంతోత్సవం నిర్వహించారు.
రాత్రి 7.00 గం.లకు గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు.
వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.



No comments :
Write comments