13.6.25

గరుడవాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు








అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7.30గం.లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.

రాత్రి 7.30 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 - 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 గం. నుండి 5.30 గం.ల వరకు శ్రీవారిని ఊంజల్ మండపమునకు వేంచేపు చేశారు. సా. 5.30 - 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు.
అనంతరం రాత్రి 7.30 గం.లకు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు. గరుడ సేవను తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
జూన్ 12న గురువారం ఉదయం 8.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామి వారు వివరించనున్నారు.
వాహన సేవలో టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, డిఎల్వో శ్రీ వరప్రసాద్ రావు, డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, వీజీవో శ్రీ సురేంద్ర, హెల్త్ ఆఫీసర్, డా. సునీల్ కుమార్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments