19.6.25

హనుమంత వాహనంపై విహరించిన శ్రీ సుందరరాజస్వామి వారు









తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు రెండవ రోజు వైభవంగా సాగాయి.

ఉదయం 10 -11గం.ల మధ్య స్వామి వారికి కళ్యాణోత్సవం చేపట్టారు.
మధ్యాహ్నం 3 - 4 గం.ల మధ్య శ్రీ కృష్ణ‌స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, పసుపు, చందనాల‌తో వేడుకగా అభిషేకం నిర్వ‌హించారు.
సాయంత్రం 5.45 - 6.15 గం.ల మధ్య ఊంజల్ సేవ చేపట్టనున్నారు. రాత్రికి 7 - 8.30 గం.ల మధ్య హనుమంత వాహనంపై నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తారు.
జూన్ 19న ముగింపు ఉత్సవాలు
జూన్ 19న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 7 - 8.30 గం.ల మధ్య గరుడ వాహనంపై స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ హరింధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ కె.చలపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments