21.6.25

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి - టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం









ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన జరుగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి టిటిడి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం వెల్లడించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం 6.30 గం.లకు యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. టిటిడి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దాదాపు 1500 మంది వరకు యోగాసనాలు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. టిటిడి ఉద్యోగులు, సిబ్బంది, టిటిడి కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు హాజరుకానున్నారు. పేరెడ్ గ్రౌండ్ కు యోగాసనాలు చేసేందుకు వచ్చిన వారికి అల్పాహారం, త్రాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

No comments :
Write comments