10.6.25

చంద్రప్రభ వాహనంపై వెన్న కృష్ణుడి అలంకారంలో శ్రీగోవిందరాజ స్వామి ChandraPrabha Vahanam
















తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాత్రి 7.30 గంట‌ల‌కు గోవిందరాజస్వామివారు చంద్ర‌ప్రభ వాహనంపై వెన్న కృష్ణుడి అలంకారంలో ద‌ర్శ‌న‌మిచ్చారు.


మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర‌ భగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తాడు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, అర్చకులు, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. 
 
జూన్ 09న రథోత్సవం
 
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవం వైభవంగా జరుగనుంది.  ఉదయం 6.15 గంటల నుండి రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. 

రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

No comments :
Write comments