9.6.25

హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో విహరించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు Hamsa Vahanam







అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి సరస్వతి అలంకారంలో స్వామివారు హంస వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, ఏవీఎస్వో శ్రీ సతీష్ కుమార్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments