అన్నమయ్
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ జూలై 05 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలను వై భవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు జూ లై 04వ తేదీ అంకురార్పణ జరుగనుం దన్నారు. భక్తులకు స్వామివారి దర్శనం, తాగునీరు, ప్రసాదాలు అం దచేయాలని కోరారు.
జూలై 05న ఉదయం 10.30 నుండి 11. 00 గంటల వరకు ధ్వజారోహణంతో బ్ రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ
05-07-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – యాలి వాహనం
06-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హంస వాహనం
07-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – సింహ వాహనం
08-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హనుమంత వాహనం
09-07-2024
ఉదయం – శేష వాహనం
రాత్రి – గరుడ వాహనం
10-07-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
11-07-2024
ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం ( ఉదయం 10 గంటలకు)
రాత్రి – గజ వాహనం
12-07-2024
ఉదయం – రథోత్సవం (ఉదయం 08 గం టలకు)
రాత్రి – అశ్వవాహనం
13-07-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
జూలై 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చె ల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్ గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీ యం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 14న సాయంత్రం 6 గంటలకు పుష్పయా గం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్ మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజె క్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్ యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించనున్ నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీ మతి ప్రశాంతి పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధి కారిచే విడుదల చేయబడినది.
తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్ వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివా రి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
జూలై 06 నుండి 15వ తేదీ వరకు వా ర్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2025, జూన్ 26: టిటిడికి అనుబం ధంగా ఉన్న తాళ్లపాకలోని శ్రీ చె న్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్ వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్ సవాల గోడ పత్రికలను టిటిడి ఛైర్ మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరిం చారు. ఈ మేరకు తిరుమలలోని ఛైర్ మన్ క్యాంపు కార్యాలయంలో గురువా రం టిటిడి అదనపు ఈవో శ్రీ సిహె చ్ వెంకయ్య చౌదరితో కలసి ఆవిష్ కరించారు. బ్రహ్మోత్సవాల్లో భక్ తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించా రు.
అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సి ద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్ రహ్మోత్సవాలు జూలై 06 నుండి 15వ తేదీ వరకు వైభవంగా జరుగనున్ నాయి. ఈ రెండు ఆలయాల బ్రహ్మోత్ సవాలకు జూలై 05వ తేదీ అంకురార్ పణ జరుగనుంది.
శ్రీ చెన్నకేశవస్వామివారి వా హనసేవలు :
జూలై 06న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి . రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్ తారు. జూలై 07న ఉదయం పల్లకీ సే వ, రాత్రి హంస వాహనం, జూలై 08న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సిం హ వాహనం, జూలై 09న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. జూలై 10న ఉదయం మోహినీ అవతారం, గరుడసేవ నిర్వహిస్తారు .
జూలై 11వ తేదీ సాయంత్రం 06 నుం డి ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుం ది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పా ల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్ తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 8.30 గంటలకు గజ వాహనంపై స్వామి వారు విహరిస్తారు. జూలై 12న సా యంత్రం 6.00 గంటలకు రథోత్సవం, జూలై 13న రాత్రి అశ్వవాహనం, జూ లై 14న ఉదయం 9 - 10.15 గం.ల మధ్య చక్రస్నానం ని ర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మో త్సవాలు ముగియనున్నాయి.
శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వా హనసేవలు :
జూలై 06న ఉదయం 6.16 గం.లకు ధ్ వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్ రారంభమవుతాయి. రాత్రి 6 గం.లకు హంసవాహన సేవ నిర్వహిస్తారు. జూ లై 07న ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం, జూలై 08న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చి న్నశేష వాహనం, జూలై 09న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వా హనాలపై స్వామివారు భక్తులకు కను విందు చేస్తారు.
జూలై 10న ఉదయం పల్లకీ సేవ రాత్ రికి నంది వాహనం జరుగనుంది. జూ లై 11న సాయంత్రం 06.00 గం.లకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చె ల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్ గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీ యం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్ పం, అన్నప్రసాదం బహుమానంగా అం దజేస్తారు. ఆ తరువాత రాత్రి 07. 30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు. జూలై 12న సా యంత్రం పల్లకీ సేవ, జూలై 13న సా యంత్రం 06.00 గంటలకు పార్వేట ఉత్సవం, జూలై 14న ఉదయం 10.00 - 12 గం.ల మధ్య వసంతోత్సవం, త్రి శూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
జూలై 15వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీసిద్ ధేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 06 - 08 గం.ల మధ్య పుష్పయాగం ఘనంగా జరుగనుంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్ నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యం లో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్ మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీ మతి ప్రశాంతి పాల్గొన్నారు.

No comments :
Write comments