తిరుపతి రాయల చె
అనంతరం శ్రీ మరకత శక్తి కాళీదే వి, శ్రీ మరకత సిద్దేశ్వర స్వా మి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ శక్తి పీఠాదేశ్వరీ మాతాజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానం ద భారతి స్వామిని మర్యాద పూర్ వకంగా ఛైర్మన్ కలుసుకున్నారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మా ట్లాడుతూ, శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించి స్వామి వారు, మాతాజీ వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ శక్తి పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతు న్నారన్నారు. ఈ పీఠంలో పూజా కైం కర్యాలు, అన్నదానం చాలా బాగా చే స్తున్నారని చెప్పారు.
ఈ పీఠాన్ని సందర్శిస్తే కష్టాలు తీరుతాయనే విశ్వాసంతో భక్తులు చాలా మంది వస్తున్నారని ఛైర్ మన్ చెప్పారు.
ప్రస్తుతం టిటిడి చాలా మంచి కా ర్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీ శక్తి పీఠం నిర్వాహకులు అభినం దించారని తెలిపారు.
ముందుగా టిటిడి ఛైర్మన్ శ్రీ శక్తి పీఠం చేరుకోగానే నిర్వా హకులు స్వాగతం పలికారు. అనంతరం టిటిడి ఛైర్మన్ ను సత్కరించి వై దేహి మాలను సమర్పించారు. శ్రీ శక్తి పీఠం తరుపున పుస్తక ప్రసా దాన్ని ఛైర్మన్ కు అందించారు. అనంతరం స్వామి, అమ్మవారిని టిటి డి ఛైర్మన్ శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు.















No comments :
Write comments