30.7.25

ఆగస్టు 1, 2వ తేదీల్లో వెంగమాంబ 208వ వర్ధంతి ఉత్సవాలు vengamamba death anniversary



శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవ


యిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 1, 2వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి.


తిరుప‌తిలో...

తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 1వ తేదీన ఉదయం 9 గంట‌లకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, ఉద‌యం 10 గంటల‌కు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  

ఆగస్టు 2వ తేదీ ఉదయం 9 గంటలకు ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గంటల‌కు సంగీత క‌చేరి,  ఉద‌యం 11.30 గంట‌ల‌కు హ‌రిక‌థ, సాయంత్రం 6 గంటలకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుమ‌ల‌లో...

ఆగస్టు 2వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టీటీడీ ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.

త‌రిగొండ‌లో...

వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు శ్రీలక్ష్మీనృసింహస్వామి వారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.

No comments :
Write comments