11.7.25

జూలై 11 - 13వ తేదీ వరకు శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మండలాభిషేక కార్యక్రమం జూలై 11న అంకురార్పణ Kaligiri




చిత్తూరు జిల్లా కలిగిరికొండ శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూలై 11 - 13వ తేదీ వరకు మండలాభిషేక కార్యక్రమం వైభవంగా జరుగనుంది. 

జూలై 11వ తేదీ ఉదయం 07.15 నుండి 11.00 గం.ల వరకు పుణ్యాహవచనం, ఆచార్య వరణము, వాస్తు హోమం, అకల్మష హోమం, సభ, పౌండరీ కాగ్ని ప్రతిష్ట, శాంతి హోమము, ధృవమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం, అలంకారం, విశేష పూజ నిర్వహిస్తారు. సాయంత్రం 05.30 గం.ల నుండి 09.00 గం.ల వరకు అంకురార్పణం, ప్రధాన శాంతి హోమం, కళాపకర్షణం చేపడతారు.
జూలై 12వ తేదీ శనివారం ఉదయం 08.00 - 12.00 గం.ల వరకు పుణ్యాహం, ఉత్సవమూర్తికి చతుర్థశ కళశ స్నపనం, పంచగవ్య క్షీర, జలాధివాసములు, అధివాసాంగ హోమం చేపడుతారు. సాయంత్రం 05.30 - 08.30 గం.ల  వరకు సర్వదైవత్యం, హోమం, మహాశాంతి హోమం, ధాన్యాధివాసం నిర్వహిస్తారు.
జూలై 13వ తేదీ ఆదివారం ఉదయం 06.00 - 07.30 గం.ల వరకు పుఅయాహం, పూర్ణాహుతి, ఉదయం 07.55 - 08.20 గం.ల వరకు ఉత్సవమూర్తికి కళా వాహనం, స్నపన తిరుమంజనం, అలంకారం, ఉదయం 11.00 - 12.00 గం.ల వరకు శాంతి కళ్యాణం, సాయంత్రం 05.00 - 06.30 గం.ల వరకు గరుడ సేవను నిర్వహించనున్నారు.

No comments :
Write comments