11.7.25

జూలై 12న అప్పలాయగుంటలో పుష్పయాగం జూలై 11న అంకురార్పణ Pushpa Yagam




అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జూలై 12వ తేదీ శనివారం పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూలై 11వ తేదీ శుక్రవారం రాత్రి 7.30 - 8.00 గం.లమధ్య అంకురార్పణ నిర్వహిస్తారు.

 
జూన్ 07 నుండి 15వ తేదీ వరకు శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే.
 
ఈ ఉత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.  అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం చేపడతారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 02.00 నుండి సాయంత్రం 5 గంటలవరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికిఅభిషేకం చేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

No comments :
Write comments