20.7.25

ఘనంగా ప్రారంభమైన ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం Andal Ammavaru





తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శనివారం శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం 6 నుండి 6.30 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.


జూలై 28న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర సంద‌ర్భంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్‌ క్వార్టర్స లోని గీతా మందిరం, ఆర్‌ఎస్‌ మాడ వీధి లోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ భాస్కర నారాయణ చౌదరి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments