2.7.25

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ Ankurapanam







తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 02వ తేదీ బుధవారం జ‌రుగ‌నున్న‌ పుష్పయాగానికి మంగళవారం  సాయంత్రం 5.30 - 8.30 గం.ల మధ్య సేనాధిప‌తి ఉత్స‌వం, శాస్ర్తోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా శ్రీ విష్వ‌క్సేనులవారు ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించారు. ఆ త‌రువాత అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.
బుధవారం ఉదయం 9.30 గంటలకు సతీసమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో శ్రీదేవి , భూదేవి సమేత స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6 - 7.30 గం.ల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను ఆశీర్వదించనున్నారు. 
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి,  ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments