19.7.25

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు AP CM Visit











తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి  శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు  రానున్న నేపథ్యంలో  ఆలయంలో ఏర్పాట్లను  టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. 


రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఈవో ఆలయ పరిసరాలు, పార్కింగ్,  క్యూలైన్లు, పాదరక్షలు భద్రపరచు కౌంటర్లు, పుష్కరిణి, జలపాతం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఎస్ఈలు శ్రీ మనోహర్, శ్రీ వెంకటేశ్వర్లు, విజిఓ శ్రీ సురేంద్ర, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆరోగ్యశాఖ డెప్యూటీ ఈవో శ్రీ సోమన్ నారాయణ,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments