31.7.25

శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్.బి.ఏ అక్రిడిటేషన్ కళాశాల అధ్యాపకులు, సిబ్బందిని అభినందించిన టిటిడి ఈవో




టీటీడీ ఆధ్వర్యంలో తిరుప‌తిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు 2028వ సంవ‌త్స‌రం వ‌ర‌కు నేషనల్ బోర్డు అక్రిడిటేషన్ (ఎన్.బి.ఏ) మంజూరు చేసింది.  


ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు మాట్లాడుతూ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం. పద్మావతమ్మ, అధ్యాపకులు, సిబ్బంది సమిష్టి కృషితో పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ అక్రెడిటేషన్ మంజూరు అయ్యేలా పనిచేశారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింతగా కష్టించి జాతీయ స్థాయిలో కళాశాలకు గుర్తింపు తీసుకురావాలని, మరింత నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. 
శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్.బి.ఏ గడవు ముగియడంతో ఎన్.బి.ఏ ప్రతినిధులు గ‌త నెల‌లో కళాశాలలో ఇన్ స్పెక్షన్ నిర్వహించి 2028 వ‌ర‌కు అక్రిడిటేషన్ ఇచ్చారు.

గ‌త నెల‌లో న్యూఢిల్లీ నుండి విచ్చేసిన ఎన్.బి.ఏ నిపుణుల బృందం కళాశాలలోని ప్రయోగశాలలు, అధ్యాపకులు, సిబ్బంది వివరాలు, రికార్డులు, మౌళిక సదుపాయాలను పరిశీలించారు. కళాశాలలో బోధన, ల్యాబ్స్, లైబ్రరీ, బోధన తదితర అంశాలపై విద్యార్థుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించారు. నేషనల్ బోర్డ్ నిబంధనల మేరకు పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తుండడంతో ఎన్.బి.ఏ మంజూరు అయింది. 

ఈ ఎన్.బి.ఏ అక్రిడిటేషన్‌కు సహకరించిన టిటిడి ఈవో శ్రీ జె శ్యామ‌ల‌రావు, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, డిఈవో శ్రీ వేంకట సునీల్, కళాశాల బృందానికి ప్రిన్సిపాల్ డా.ఎం. పద్మావతమ్మ ధన్యవాదాలు తెలియజేశారు.

No comments :
Write comments