3.7.25

సాక్షి ఛానెల్లో ప్రసారమైన ''తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బంది'' అనే వార్తను టీటీడీ ఖండిస్తోంది‌. ఇది పూర్తిగా వాస్తవ దూరం




జూన్ 29వ తేది మధ్యాహ్నం తిరుమల లోని అఖిలాండం వద్ద ఎటువంటి లైసెన్స్ లేకుండా అనధికారికంగా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో అక్కడే విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు సదరు  ఫోటోగ్రాఫర్ ను ప్రశ్నించిన క్రమంలో కెమెరాను వేరే వారికి ఇచ్చి పంపినందుకు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కెమెరా ను తెప్పించమన్నందుకు ఫోటోగ్రాఫర్ అసభ్యకరమైన భాషను సిబ్బందిపై వాడటం, ఒకరినొకరు మాట మాట పెంచుకొని గొడవ పడినట్టుగా తెలిసింది. 

గొడవను పెంచుకుంటూ ఇద్దరు ఆస్థాన మండపంలొని షాపు నంబర్: 96 వద్ద గొడవపడిన విషయం సీసీ కెమెరాలో రికార్డైంది.
ఈ ఘటనలో షాప్ నెంబరు: 96, (ఫోటో స్టూడియో) లో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్ ను తాను ప్రవర్తించిన తీరు పై వివరణ కోరడమైనది. 
అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ప్రవర్తించిన తీరు నియమాలకు విరుద్ధంగా ఉండడంతో అతనిని తిరుమల నుండి విధుల నుంచి తప్పించి తిరుపతికి పంపించడం జరిగింది.
వాస్తవాలు ఇలా ఉండగా ఈ ఘటనను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం భావ్యం కాదు. 

No comments :
Write comments