6.7.25

టిటిడిలో నిర్మాణంలో ఉన్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి - టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు focus on alipiri toll gare








 శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలసి శనివారం అధికారులతో ఈవో  సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడిలో జరుగుతున్న పనులపై  ఎప్పటికప్పుడు సమీక్షించుకుని నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుత్తేదారులలో అలసత్వం లేకుండా ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని కోరారు. టిటిడిలో దళారి వ్యవస్థ, నకిలి టికెట్ల పేరుతో సేవల టికెట్ల అమ్మకాలు, అవినీతిపై మరింత నిఘా ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు మరింత నాణ్యంగా, వేగంగా సేవలు అందించేందుకు అలిపిరి టోల్ గేట్ ప్లాజా వద్ద చెకింగ్ పాయింట్ విస్తరణ, లేటెస్ట్ కెమెరాల ఏర్పాటు, వాహనాలు, లగేజీ స్కానింగ్ యంత్రాలు,  సెక్యూరిటీ పెంచే అంశం తదితర అంశాలపై టిటిడి సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఐటీ అధికారులు అంతర్జాతీయ విమానాశ్రయాలలో సౌకర్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు.

భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో కళ్యాణ కట్ట కొరకు ఎంపిక చేసిన ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్మాణం చేపట్టి దశలవారీగా విస్తరణ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు నిల్వ వుంచే వంటసామాగ్రి కోసం మార్కెటింగ్   గోడౌన్ లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అలిపిరి భూదేవి కాంప్లెస్ లో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.  

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం, శ్రీ కపిలతీర్థం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, అమరావతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం, తిరుమలలోని పాపవినాసం, శిలాతోరణం ప్రాంతాలలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నవీ ముంబై, బాంద్రా, యానం, అనంతవరం, ఉల్లందూర్ పేట తదితర ప్రాంతాలలో ఆలయాల నిర్మాణాలపై తాజా పరిస్థితిని నివేదించాలన్నారు.  

 ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఎఫ్.ఏ అండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ,  శ్రీ టివి సత్యనారాయణ,  తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments