30.7.25

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి garuda panchami









గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది.


శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు.

గరుడ వాహనసేవలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments