8.7.25

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు Pavitrotsavams









తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా జూలై 07న సోమవారం ఉదయం నుండి శాస్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, అభిషేకం, అలంకారం, అర్చన, నివేదన చేపట్టారు. ఉదయం 09.00 - 10.00 గం.ల వరకు పంచమూర్తుల ఉచ్చవర్లకు స్నపనతిరుమంజనం, అలంకారం  నిర్వహించారు.


సాయంత్రం కలశ స్థాపనం, కలశ పూజ, అగ్ని కార్యం, హోమం, లఘు పూర్ణాహూతి, గ్రంధి పవిత్ర ప్రతిష్ట  నిర్వ‌హిస్తారు.

జూలై 08న ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు.

జూలై 09న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ  అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments