తిరుపతిలోని శ్
గత బ్రహ్మోత్సవాల్లో గానీ, ని త్యకైంకర్యాల్లో గానీ అర్చక పరి చారకులు, అధికార, అనధికారులు, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవై నా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్ రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్ వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పా లు, తులసి, మరువం, దమనం, బి ల్వం, పన్నీరాకు వంటి 6 రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమే త శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్ పాలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఏఇవో శ్రీ గోపినాథ్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తు లు పాల్గొన్నారు.




No comments :
Write comments