29.7.25

తిరుమ‌ల‌లో శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర sri andal tiruvadipuram








తిరుమలలో సోమవారం శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర  జరిగింది.


సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇచ్చారు. శేషహారతి, పుష్ప మాల‌, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పించారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచారు. అక్కడినుంచి స్వామి, అమ్మవార్లు తిరిగి ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో పేష్కార్ శ్రీ రామ కృష్ణ, పారు పత్తేదార్ శ్రీ హిమంత గిరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments