12.7.25

తిరుమ‌ల‌లో అభివృద్ధి ప‌నుల పురోగ‌తిపై టీటీడీ ఈవో విభాగాల వారిగా స‌మీక్ష‌ TTD Eo Review




తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల పురోగ‌తిపై విభాగాలవారిగా అధికారుల‌తో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రితో క‌లిసి తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో శుక్ర‌వారం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.


ఈ సంద‌ర్భంగా తిరుప‌తిలో ఎస్ఎస్‌డీ కౌంట‌ర్ల‌ నిర్వహణ, అన్నప్రసాదం విభాగం ఆధునీక‌ర‌ణ‌, పరకామణి నిర్వహణ, పారిశుద్ధ్యం, టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా బాలాజీ నగర్ గృహాల ప‌రిశీల‌న‌, కాలిబాట మార్గాలలోని దుకాణాల‌ తనిఖీలు,  యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాల్లో కేంద్రీకృత లాకర్ కేటాయింపు వ్య‌వ‌స్థ‌, ఎఫ్ఎంఎస్‌ మొబైల్ యాప్ వినియోగం, తిరుమలలో ల్యాండ్‌స్కేప్ సర్వే, కొత్తగా రూపొందిస్తున్న కాటేజ్ డొనేషన్ పాలసీ, సీఆర్వో పునర్నిర్మాణం వంటి అంశాల‌పై వివ‌రంగా చ‌ర్చించారు.

భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు నిర్దేశిత స‌మ‌యంలోపు త‌మ‌కు కేటాయించిన ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్వో శ్రీ ముర‌ళీ కృష్ణ‌ (వ‌ర్చువ‌ల్ గా హాజ‌ర‌వ్వ‌గా), డీఎఫ్వో శ్రీ ఫ‌ణి కుమార్ నాయుడు, సిఈ శ్రీ స‌త్య నారాయ‌ణ‌, ట్రాన్స్ పోర్ట్ అండ్ ఐటీ జీఎం శ్రీ శేషారెడ్డి, ఎస్టేట్ ఆఫీస‌ర్ శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, టౌన్ ప్లానింగ్ అండ్ అర్బ‌న్ డెవ‌లప్మెంట్ అధికారి శ్రీ రాముడు, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్క‌ర్‌, శ్రీ సోమ‌న్నారాయ‌ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments