2.7.25

నకిలీ వ్యక్తులను నమ్మి మోసపోవద్దు TTD TO Devotees



పెద్దింటి ప్రభాకరాచార్యులు పేరుతో వైష్ణవ యా


త్రాస్ అనే ఫేస్ బుక్ పేజీని నడుపుతున్న వ్యక్తి శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కల్పిస్తామంటూ ప్రచారం చేయడం టీటీడీ దృష్టికి వచ్చింది.

ఇలాంటి నకిలీ వ్యక్తులు, వెబ్ సైట్ లను నమ్మి మోసపోకూడదని, టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.
శ్రీవారి దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది.

No comments :
Write comments