14.8.25

ఆగష్టు 16న టిటిడి గోసంరక్షణ శాలలో వార్షిక గోపూజ go pooja




టిటిడి శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ శాలలో ఆగష్టు 16వ తేదీన గోకులాష్టమి సందర్భంగా వార్షిక  గోపూజను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రోజున ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం తదుపరి వేణుగానం, వేద పఠనం తదితర కార్యక్రమాలు చేపడుతారు. అటు తర్వాత శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధిలో గోపూజ, హారతి తదితర కైంకర్యాలు చేపడుతారు. 


ఈ సందర్భంగా టిటిడి వేద పాఠశాల ద్వారా వేద పఠనం, హింధూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారుల ద్వారా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.  

No comments :
Write comments