15.8.25

ఆగష్టు 18వ తేదీన ఆఫ్ లైన్‌లో వాచీల వేలం offline auction




తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, టిటిడిలో  అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్న 19 లాట్ల వాచీలకు ఆగష్టు 18వ తేదీన  ఆఫ్ లైన్ ద్వారా టెండర్ కం వేలం వేయనున్నారు.


వాచీలలో టైటాన్, సిటిజెన్, సొనాటా, రాగ, టైమెక్స్ ఇతర స్మార్ట్ వాచెస్ లకు ఆఫ్ లైన్ ద్వారా టెండర్ కం వేలం వేయనున్నారు.

ఆసక్తి కల్గిన బిడ్డర్లు వాచీల వేలంలో పాల్గొనవచ్చు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్( వేలములు)  / ఏఈవో ( వేలములు), టిటిడి, హరే కృష్ణ మార్గ్, తిరుపతిలో  లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 - 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించగలరు.

No comments :
Write comments