25.8.25

సెప్టెంబ‌రు 2 నుండి 4వ తేదీ వ‌ర‌కు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు Narapura Venkateswara Swamy Vari Temple




జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సెప్టెంబ‌రు 2 నుండి 4వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబ‌రు 1న సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు.


సెప్టెంబ‌రు 2న‌ చ‌తుష్టార్చాన‌, అగ్ని ప్ర‌తిష్ట‌, ప‌విత్ర ప్ర‌తిష్ట, సాయంత్రం 6 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబరు 3న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 4న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.

యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

No comments :
Write comments