25.8.25

సెప్టెంబ‌రు 2న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం Koil alwar Tirumanjanam




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 2న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.


ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టనున్నారు. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌ను ర‌ద్దు చేశారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుండి 7వ‌ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 4న సాయంత్రం ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

సెప్టెంబ‌రు 5న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 6న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 7న మహాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు.

No comments :
Write comments