26.8.25

సెప్టెంబ‌రు 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు దేవుని క‌డ‌ప‌ శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు Pavitrotsavams




క‌డ‌ప‌ జిల్లా దేవుని క‌డ‌ప‌లోని శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబ‌రు 4న సాయంత్రం పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వ‌హిస్తారు.


సెప్టెంబ‌రు 5న ఉద‌యం చ‌తుష్టార్చాన‌, అగ్ని ప్ర‌తిష్ట‌, ప‌విత్ర ప్ర‌తిష్ట, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబరు 6న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 7న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.

ఆల‌యంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి.  వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

No comments :
Write comments