ఆగష్టు 15న నిర్వహించే 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
జాతీయ జెండా వందనం అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
No comments :
Write comments