22.8.25

అమరావతి ఎస్వీ ఆలయంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు amaravati temple




అమరావతి (వేంకటపాలెం) శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగియనున్నాయి.


ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వహించారు. అనంత‌రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, రుత్వికులకు బహుమానం,  పవిత్రోత్సవాలతో ముగియ‌నున్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ శ్రీ మ‌ల్లికార్జున‌, టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు శ్రీ రామ‌కృష్ణ‌, శ్రీ సందీప్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments