28.8.25

శాస్త్రోక్తంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ ధ్వజస్థంభ జీర్ణోదరణకు అంకురార్పణ ankurarpanam





ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోదరణకు బుధవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రక్తంగా అంకురార్పణ నిర్వహించారు . 

ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేలుకొల్పి, అర్చన జరిగింది. సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేనారాదన, పుణ్యాహవచన, రక్షాబంధన, అంకురార్పణ నిర్వహించారు.
ఆగస్టు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, వాస్తు హోమం, పంచగవ్య స్నపనం,  కుంభస్థాపనం, సయ్యాధివాసం, తత్వ హోమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ  అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments