5.8.25

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనాన్ని తనిఖీ చేసిన టిటిడి ఈవో Annadana Bhawan









మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టిటిడి భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాల నాణ్యత, రుచిని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరితో  కలిసి సోమవారం తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా ఈవో టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అంతకుముందు ఈవో, అదనపు ఈవోతో కలసి అన్న ప్రసాద భవనంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. తరువాత కియోస్క్ మిషన్ ద్వారా ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు విరాళం అందించారు.

అనంతరం ఈవో అన్నప్రసాద భవనంలోని క్యూలైన్లు, పరిశుభ్రత, ముడి సరుకుల నిల్వ గది తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత ఈవో గ్యాస్ ప్లాంట్ ను కూడా పరిశీలించారు. 

ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments