1.8.25

విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఘనంగా ముగిసిన ''అష్టబంధన మహాసంప్రోక్షణ'' Astabandhana Samprokshana




విజయవాడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ''అష్టబంధన మహాసంప్రోక్షణ'' కార్యక్రమం గురువారం ఉదయం 11.25 నుండి 12.24 గంటల వరకు మహాసంప్రోక్షణతో ఘనంగా ముగిసింది.


ఉదయం 7.30 గంట‌లకు మహా పూర్ణాహుతి నిర్వ‌హించారు. అనంతరం ఉదయం 11.25 గంట‌లకు తులాలగ్నంలో కళావాహనం, ప్రథమ కాలార్చనము, మహా సంప్రోక్షణ, అక్షతారోహణ, బ్రహ్మ ఘోష తదితర కార్యక్రమాలు నిర్వ‌హించి, భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించారు.

 ఈ కార్య‌క్ర‌మంలో ఆగమ సలహాదారు శ్రీ భావనారాయణ చార్యులు, కంకణ బట్టర్ శ్రీ మురళీకృష్ణ స్వామి అయ్యంగార్, ఇంజనీరింగ్ అధికారులు శ్రీ నాగభూషణం, సురేంద్రనాథ్ రెడ్డి, శ్రీ జగన్మోహన్, సూపరింటెండెంట్ శ్రీ మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ లలితా రమాదేవి  అర్చ‌కులు, భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments