3.8.25

దేశం సుసంపన్నంగా ఉండాలి - కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి Central Minister










కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ శనివారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశం సుసంపన్నంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని  అమ్మవారిని ప్రార్థించినట్లు కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరీ  తెలిపారు. 

ముందుగా ఆలయం వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ ఎం. రాంప్రసాద్ రెడ్డి, టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకి స్వాగతం పలికారు. ఆలయంలోకి చేరుకున్నాక ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. 

అమ్మవారి వేద పండితులు వేద ఆశీర్వచనాలతో మంత్రి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో గౌ|| కేంద్ర మంత్రికి టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు అమ్మవారి ప్రసాదాలు, వస్త్రాలను కేంద్ర మంత్రికి అందచేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు మెంబర్ శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, అర్చకులు శ్రీ బాబు స్వామి, ఏఈవో శ్రీ దేవరాజులు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments