31.8.25

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ చెన్న‌కేశ‌వ‌స్వామివారి పవిత్రోత్సవాలు chenna kesava swamy




అన్న‌మ‌య్య జిల్లా తాళ్ల‌పాక శ్రీ చెన్న‌కేశ‌వ‌స్వామివారి ఆల‌య‌ పవిత్రోత్సవాలు శ‌నివారం ఉద‌యం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

ఉదయం 5 గంట‌ల‌కు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం పవిత్ర వితరణ, ప‌విత్ర జ‌ల ప్రోక్ష‌ణ‌, మ‌హాపూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగిశాయి.  
త‌రువాత‌ సాయంత్రం 6 గంటలకు తిరువీధి ఉత్సవం జ‌రుగ‌నుంది.
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, సూప‌రింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్ప్‌క్ట‌ర్ శ్రీ బాలాజీ, ఆల‌య అర్చ‌కులు, విశేష షంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments