వినాయక చవితి సందర్భంగా బుధవారం తిరుమల మొదటి మరియు రెండో ఘాట్ రోడ్లలో ఉన్న శ్రీ వినాయక స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
అదేవిధంగా, తిరుమల నుండి తిరుపతి కి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయానికి గణేష్ చవితి సందర్భంగా ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments