16.8.25

టీటీడీ స్వాతంత్య్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా అశ్వ ప్రదర్శన horse show













తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శుక్ర‌వారం జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకల్లో టీటీడీ కళాశాలల ఎన్‌సిసి విద్యార్థిని విద్యార్థులు అశ్వాలతో ప్రదర్శించిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.


లెఫ్ట్‌నెంట్ క‌ల్నాల్ శ్రీ అనుప్ ఆధ్వ‌ర్యంలో గుడ్ లక్, రోమన్ ఫ్లేమ్, గగన్‌, ఫైటర్, రాణి ఝాన్సీ, బ్లోరి అనే పేర్లు గల అశ్వాలతో ఎన్‌సిసి క్యాడెట్లు పలు విన్యాసాలు చేశారు. మొదటగా జాతీయ జెండా, ఎన్‌సిసి జెండా, టిటిడి జెండాలను ప్రదర్శించారు. అదేవిధంగా, టెంట్‌ పెగ్గింగ్‌, షో జంపింగ్‌ తదితర విన్యాసాలు చేశారు. క్యాడెట్లు అశ్వాలపై పరేడ్‌ మైదానంలో చుట్టూ తిరుగుతూ చేసిన ఈ విన్యాసాలు అలరించాయి.

ప్రత్యేక ఆకర్షణగా టిటిడి జాగిలాల ప్రదర్శన :

టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జి శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు ఆధ్వర్యంలో విరాట్‌, రాణి, షైని, ఇందు, వర్ష, బ్యూటీ అనే జాగిలాలు పాల్గొన్నాయి.

ఇందులో జాగిలం బొకే అందించడం, గ్రూప్‌ డ్రిల్‌, పేలుడు పదార్థాలను, మాదకద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్‌ డ్రిల్‌, ఫైర్ జంప్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి.

అగ్నిమాప‌క సిబ్బంది విన్యాసాలు

అగ్నిమాప‌క సిబ్బంది త‌మ విన్యాసాల‌తో అగ్ని ప్ర‌మాదాలపై అవ‌గాహ‌న, ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ప్పుడు  ఎలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి, త‌దిత‌ర అంశాలను వివ‌రించారు.

ఇందులో సాలిడ్‌, లిక్విడ్‌, గ్యాస్ నుండి వ‌చ్చే ఫైర్‌ను ఎలా అదుపు చేయాలి, ఇంటిలో వంట చేస్తున్న‌ప్పుడు  సిలిండ‌ర్‌పై మంట‌లు వ్యాపిస్తే ఎలా అదుపు చేయాలి త‌దిత‌ర అంశాల‌ను త‌మ విన్యాసాల‌తో అవ‌గాహ‌ణ క‌ల్పించారు.

No comments :
Write comments