తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు.
ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా కలశస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేశారు. ఈ సందర్భంగా కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ సుబ్బా రాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఇతర అధికారులు, ఆర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments