21.8.25

శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన‌ బాలాల‌యం poornahuti









దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో గ‌త మూడు రోజులుగా నిర్వ‌హిస్తున్న బాలాల‌యం కార్య‌క్ర‌మాలు బుధ‌వారం ఉద‌యం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. 


ఇందులో భాగంగా ఉద‌యం 9.30 గంట‌లకు మ‌హాపూర్ణాహుతి, ఉదయం 10 నుంచి 11.15 గంటల మధ్య తులా లగ్నంలో బాల బింబ‌ ప్ర‌తిష్ట‌, బాలాలయ సంప్రోక్షణ నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, సూప‌రిండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వ‌ర్ రెడ్డి, అర్చ‌కులు పాల్గొన్నారు.

No comments :
Write comments