1.8.25

టిటిడి పాఠశాలల్లో ముగిసిన సద్గమయ శిక్షణా తరగతులు sadamaya training classes







తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా ఆగష్టు 28 నుండి 31వ తేదీ వరకు నిర్వహించిన సద్గమయ శిక్షణ తరగతులు ముగిశాయి. తిరుపతి, తిరుమలలోని టిటిడికి చెందిన   1. తిరుపతిలోని ఎస్.జీ.ఎస్. హైస్కూల్, 2. ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, 3. ఎస్వీ హైస్కూల్, 4. ఎస్.కె.ఆర్.ఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ , 5. ఎస్పీ బాలికల పాఠశాల, 6. తాటితోపులోని ఎస్.కె.ఎస్. హైస్కూల్, 7. తిరుమలలోని ఎస్వీ హైస్కూల్ లలో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సద్గమయ శిక్షణ తరగతులు నిర్వహించారు. దాదాపు 70 మందిఎంపిక చేయబడ్డ అద్యాపకులచే శిక్షణ ఇచ్చారు.  


ఈ శిక్షణ తరగతులలో విద్యార్థులకు భక్తి భావం, భగవద్గీత, మానవీయ కోణం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, క్విజ్, సింహహలోకనం, విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు, మన సంస్కృతి - సాంప్రదాయాలు తదితర అంశాలపై విశ్లేషనాత్మకంగా శిక్షణ ఇచ్చారు.  ఈ సందర్భంగా విద్యార్థులకు యువతా మేల్కోండి ... మీ శక్తిని తెలుసుకోంది...జీవన వికాసం, నిజమైన వ్యక్తిత్వం అంటే...! మానసిక శక్తులు - స్వామి వివేకానంద, దృఢ సంకల్పాలు, కనిపించే దేవతలు, అవరోధాలే అవకాశాలు, వ్యక్తిత్వ వికాస కథలు, శ్రీరామకృష్ణ పరమహంస - నీతి కథ రత్నములు, బుద్ధి వికాసం, సక్సెస్ ఆఫ్ స్టూడెంట్స్, తదితర పుస్తక ప్రసాదాలను విద్యార్థులకు అందించారు. టిటిడి పాఠశాలల్లో విద్యను అభ్యనసిస్తున్న దాదాపు 1500కు పైగా విద్యార్థులకు సద్గమయ శిక్షణ తరగతులు నిర్వహించారు.

No comments :
Write comments