2.8.25

శాస్త్రోక్తంగా త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ Sri Lakshmi Narasimha Swamy Vari Temple







అన్న‌మ‌య్య జిల్లా త‌రిగొండ‌ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజస్వంభ జీర్ణోద్ధరణ చేపట్టారు. శుక్రవారం వేకువ జామున స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి, నివేదన, బలిహరణ, తోరణ ధ్వజ కుంభ ఆరాధనము, మూలవర్లకు అభిషేకం, అలంకరణ,  హోమం నిర్వహించారు.


అనంతరం ప్రాణ ప్రతిష్టాహవనము, మహా పూర్ణాహుతి, నివేదన, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, అగ్ని కుండ ప్రదక్షణ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహా నివేదన, గర్భగుడిలోకి ప్రవేశం, ధ్వజస్తంభం జీర్ణోద్ధరణ, ఆచార్య మర్యాద, తీర్థప్రసాద  గోష్టి  చేపట్టారు.

టిటిడి ఆగమ సలహాదారులు శ్రీమాన్ కాండూరి శ్రీనివాసాచార్య స్వామి ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమోక్తంగా ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కంకణ భట్టర్ శ్రీ కె. ధనుష్ భట్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments